హత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు

హత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు

గద్వాల, వెలుగు: అదనపు కట్నం కోసం వేధించి హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ అడిషనల్   సెషన్స్  జడ్జి ప్రభాకర్  శుక్రవారం తీర్పునిచ్చారు. జిల్లా ఎస్పీ సృజన వివరాల మేరకు.. 

శాంతినగర్ మండల కేంద్రానికి చెందిన సాజిదాపై భర్త బషీర్​ అహ్మద్, అతని రెండో భార్య ఫరీదా బేగం, మరిది షేక్ బాషా 2019 నవంబర్​10న కిరోసిన్  పోసి నిప్పు పెట్టి చంపేందుకు ప్రయత్నించారు. శాంతి నగర్  పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్  ఇవ్వగా, వారిని అరెస్ట్​ చేశారు. కోర్టులో నేరం  రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. డీఎస్పీ రంగస్వామి, పీపీ వెంకట్ రాములు, కోర్టు కానిస్టేబుల్​ను ఎస్పీ అభినందించారు.