78 కొత్త రూట్లలో విమాన సేవలు

78 కొత్త రూట్లలో విమాన సేవలు

ఉడాన్ స్కీమ్ కింద ప్రకటన
న్యూఢిల్లీ: చిన్న నగరాలకు విమాన సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన ఉడాన్ ‌‌స్కీమ్‌‌ నాలుగో రౌండ్‌‌లో భాగంగా అదనంగా78 రూట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలోచాలావరకు మారుమూల ప్రాంతాలేనని మినిస్ట్రీ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్ ‌‌గురువారం ప్రకటించింది. ఈ రూట్లలో 18 వెనకబడిన ఎయిర్‌‌ పోర్టులను ఢిల్లీ, కోల్‌‌కతా, కొచ్చి వంటి మెట్రోసిటీలతో కలుపుతామని సివిల్ ‌‌ఏవియేషన్ ‌మినిస్టర్ ‌‌హర్దీప్‌ సింగ్‌‌పురీ ట్విటర్‌‌ ద్వారా ప్రకటించారు. నార్త్ ‌ఈస్ట్రన్ ‌రీజియన్‌‌, ఐలాండ్స్‌‌, వెనకబడిన ప్రాంతాలకు ఉడాన్ 4.0 కింద కనెక్టివిటీ పెంచుతామని సివిల్ ఏవియేషన్ ‌మినిస్ట్రీ జాయింట్ ‌‌సెక్రటరీ ఉషా పఢీ పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు 766 రూట్లను ఉడాన్ ‌‌స్కీమ్‌‌ కింద ప్రభుత్వం గుర్తించినట్టయ్యింది . ఇందులో274 ఉడాన్ ‌‌రూట్లు ప్రస్తుతం నడుస్తున్నాయి.