హైదరాబాద్​ కస్టమర్లకు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ వీఐపీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్

హైదరాబాద్​ కస్టమర్లకు ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ వీఐపీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్

హైదరాబాద్, వెలుగు: తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించడంలో భాగంగా హైదరాబాద్​లో వీఐపీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఫ్లిప్​కార్ట్​ ప్రకటించింది.  దీనికోసం ఏటా రూ.499 చెల్లించాలి. 

ఫలితంగా ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ వీఐపీ ప్రోగ్రామ్​లోని లక్షలాది ఉత్పత్తులపై 48 గంటల ఉచిత డెలివరీ, సూపర్​కాయిన్స్​తో 5శాతం అదనపు డిస్కౌంట్​, డెడికేటెడ్​ కస్టమర్ కేర్​, క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమానాల రీషెడ్యూల్, క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రిప్ హోటల్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై అదనపు ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. షాపింగ్ ఫెస్టివల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందస్తు యాక్సెస్ ఉంటుంది.