ఉద్యోగాలను మోసుకొచ్చిన పండగ సీజన్.. ఫ్లిప్ కార్ట్లో 2 లక్షల జాబ్స్

ఉద్యోగాలను మోసుకొచ్చిన పండగ సీజన్.. ఫ్లిప్ కార్ట్లో 2 లక్షల జాబ్స్

హైదరాబాద్, వెలుగు: ఫెస్టివల్ సీజన్​ కోసం ఫ్లిప్‌‌కార్ట్ సప్లై చెయిన్, లాజిస్టిక్స్​, డెలివరీ విభాగాల్లో 2.2 లక్షల తాత్కాలిక ఉద్యోగాలను కల్పించింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు ఫ్లిప్​కార్ట్​ ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్​ కోసం టైర్​-2, టైర్​-3 నగరాల్లో 650 కొత్త డెలివరీ హబ్‌‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా నియమించుకున్న వారిలో మహిళల సంఖ్య 10 శాతం పెరిగిందని, వికలాంగులకు కూడా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు ఫ్లిప్‌‌కార్ట్​ తెలిపింది. అమెజాన్​ కూడా తన నెట్​వర్క్​లో లక్షన్నర తాత్కాలిక ఉద్యోగాలను కల్పించింది.

ఇదిలా ఉండగా.. ఆన్​లైన్ ​షాపింగ్ ​ప్లాట్​ఫా అమెజాన్​ ఇండియా ప్రాజెక్ట్​ ఆశ్రయ్​ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హిందుస్థాన్​పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్​)తో కలిసి దేశవ్యాప్తంగా 40 కొత్త  ఆశ్రయ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. తాజాగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో కలిపి అమెజాన్కు ప్రస్తుతం 13 నగరాల్లో 65 ఆశ్రయ్​ కేంద్రాలు ఉన్నాయి. 2025 చివరి నాటికి 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆశ్రయ్ కేంద్రాల్లో డెలివరీ పార్ట్​నర్లు విశ్రాంతి తీసుకోవచ్చు. ఏసీ సీటింగ్​, పరిశుభ్రమైన తాగునీరు, మొబైల్​ చార్జింగ్ పాయింట్లు, వాష్‌‌రూమ్స్​ వంటి సౌకర్యాలను ఉచితంగా వాడుకోవచ్చు.