మెగా డిస్కౌంట్.. రూ.22వేలకే 50 అంగుళాల స్మార్ట్ టీవీ, డోన్ట్ మిస్ ది ఆఫర్..

మెగా డిస్కౌంట్.. రూ.22వేలకే 50 అంగుళాల స్మార్ట్ టీవీ, డోన్ట్ మిస్ ది ఆఫర్..

Acer 50-inch Smart TV: దేశంలో సమ్మర్ వచ్చేసింది. ఇప్పటికే పిల్లలకు స్కూల్ హాలిడేస్ కూడా ప్రకటించబడ్డాయి. దీంతో చాలా మంది ప్రస్తుతం ఇళ్లలో ఉండటంతో కొత్త గృహోపకరణాలను షాపింగ్ చేయాలని చూస్తున్నారు. ఈ సమయంలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మెగా ఆఫర్లతో ముందుకొచ్చింది.

అవును ఫ్లిప్‌కార్ట్‌లో ఏసర్ 50-అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించబడింది. హాట్ ఆఫర్ కింద 50 అంగుళాల 4K టీవీ రూ.22వేలకే అందుబాటులో ఉంది. పైగా ఇందులో చాలా తక్కువ బెజెల్ మరియు గూగుల్ ఓఎస్ కూడా ఉన్నాయి. పైగా టీవీలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి ఈ టీవీ ధర రూ.50వేలు అయినప్పటికీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 58% తగ్గింపు ధరను అందిస్తోంది. 

కొనుగోలుదారులు ప్రస్తుతం ఏసర్ టీవీని ఎలాంటి యాడాన్ డిస్కౌంట్లు లేకుండా రూ.24వేల 999కి దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎస్బీఐ కార్డు హోల్డర్లకు మాత్రం అదనంగా రూ.వెయ్యి తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.1వెయ్యి 650 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇలా అన్ని తగ్గింపులు పోయిన తర్వాత ఏసర్ 50 అంగుళాల టీవీని కేవలం రూ.22వేలకు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. 

టీవీ ప్రత్యేకతలను పరిశీలిస్తే..
50 అంగుళాల 4K టీవీలో 1.07 బిలియన్ రంగులకు మద్దతు పొందటం వల్ల రంగులు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది క్రిస్టల్ క్లియర్ టెక్నాలజీతో వస్తోంది. ఇక డాల్బీ అట్మోస్ కారణంగా చాలా స్పష్టమైన సౌండ్ పొందవచ్చు.