ఇండోనేసియాలో వరదలు.. 11 మంది మృతి.. మరో 13 మంది గల్లంతు

ఇండోనేసియాలో వరదలు.. 11 మంది మృతి.. మరో 13 మంది గల్లంతు

డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పసర్: ఇండోనేసియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు ప్రావిన్సులలో ఆకస్మిక వరదలు సంభవించి 11 మంది మృతిచెందారు. మరో 13 మంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. బుధవారం రెస్క్యూ టీమ్స్ పదకొండు మృతదేహాలను వెలికితీశాయని చెప్పారు. సోమవారం ప్రారంభమైన కుండపోత వర్షాల కారణంగా తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్, బాలి ద్వీపంలో వరదలు ముంచెత్తి, కొండచరియలు విరిగిపడ్డాయి. 

వరదల్లో ఏకంగా ఇల్లు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న ముగ్గురు చనిపోయారు. తూర్పు నుసా టెంగారాలోని నగేకియో జిల్లాలో బుధవారం ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. బాలిలో వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. కాగా, బుధవారం మరో ఎనిమిది మంది తప్పిపోయారని బాలి ప్రావిన్షియల్ రాజధాని డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీసు చీఫ్ ముహమ్మద్ ఇక్బాల్ సిమాతుపాంగ్ తెలిపారు.