ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్

ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్

కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి బడ్జెట్ లో నిధులు భారీగా పెంచింది. గతేడాది ఈ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 66శాతం పెంచింది. ప్రస్తుత బడ్జెట్ లో రూ.79వేల కోట్లు కేటాయించింది. వడ్డీ రేట్ల పెరుగుదలతో సందిగ్దంలో పడ్డ గృహ కొనుగోలుదారులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో పీఎం ఆవాస్ యోజన కింద మరింత మందికి లబ్ది చేకూరనుంది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు రుణాలపై సబ్సిడీ ఇస్తుంది. మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.  పీఎం ఆవాస్ యోజనలో భాగంగా ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2.50 లక్షల సాయం అందిస్తుంది. మొదటి విడతలో రూ. 50 వేలు, రెండో విడతలో రూ. 1.50 లక్షలు, మూడో విడతగా కొ.50 వేలు ఇస్తారు. మొత్తం రూ. 2.50 లక్షల సబ్సిడీలో ఒక లక్ష సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మిగిలిన 1.50 లక్షలు మంజూరు చేస్తుంది.