వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలి : ఐటీడీఏ పీవో రాహుల్

వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలి : ఐటీడీఏ పీవో రాహుల్
  •     ఐటీడీఏ పీవో రాహుల్​ 

భద్రాచలం, వెలుగు :  వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలని స్పెషలాఫీసర్లు, వార్డెన్లు, హెచ్​ఎంలను ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో టెన్త్​ విద్యార్థుల గురించి ఆరా తీశారు. సమయానుకూలంగా బోధన, స్టడీ అవర్లపై దృష్టిసారించాలన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను తనకు పంపించాలని సూచించారు. 

స్పెషల్ ఆఫీసర్లు వారానికి రెండు సార్లు ప్రతీ పాఠశాలను సందర్శించాలన్నారు. ఇదే సమయంలో గురుకులం విద్యార్థుల గురించి కూడా ఆయన రివ్యూ చేశారు. ఇంటర్మీడియట్​ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని సూచించారు. పరీక్షల అనంతరం జరిగే పోటీ పరీక్షలకు కూడా వారిని ప్రిపేర్​ చేయించాలన్నారు.