తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయిన యూట్యూబర్ నాగదుర్గ.. తమిళనాట హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు ధనుష్ తండ్రి కస్తూరి రాజా క్లాప్ కొట్టారు.
మగేశ్ రాజేంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జినిమా మీడియా సంస్థ నిర్మిస్తోంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్‌కు ఇది రెండో చిత్రం.
ఇక నల్గొండకు చెందిన నాగదుర్గ స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్. యూట్యూబర్‌గా పాపులర్ అయిన ఆమె.. ఇప్పటికే ‘కలివి వనం’ అనే చిత్రంలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు లభించలేదు. ఇటీవల ఆమె చేసిన ‘దారి పొంటోత్తుండు’ పాట హండ్రెడ్ మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.
లాక్‌డౌన్‌లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్‌లో అందంగా స్టెప్పులేసింది. ఇటీవలే "నా పేరు యెల్లమ్మ" పాట కూడా దుమ్మురేపింది.
