ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి : శ్రీనివాస్ రెడ్డి

ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి : శ్రీనివాస్ రెడ్డి
  • రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు :  జిల్లాలో ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్​లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్  పి.రాంబాబు, అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ పేదరికం పోవాలంటే చదువు చాలా ముఖ్యమన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు ఎగ్స్, పాలు, బాలామృతం, ఆట వస్తువులు సక్రమంగా సరఫరా చేయాలన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నామని చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్లు, పాలు, బాలామృతం సరఫరా అమలు చేస్తామని వివరించారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్ ను, కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.  సమావేశంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డీఆర్డీఏ అప్పారావు, సంక్షేమ శాఖల అధికారులు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.