రెంటల్‌ హౌసింగ్‌‌లో విదేశీ పెట్టు బడులు!

రెంటల్‌ హౌసింగ్‌‌లో విదేశీ పెట్టు బడులు!

తక్కువ వడ్డీకే అప్పులిస్తాం
తొందర్లో రాష్ట్ర ప్రభుత్వాలతో
అగ్రిమెంట్లపై సంతకాలు
వెల్లడించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్‌ సెక్రటరీ

న్యూఢిల్లీ: అఫరబుల్డ్ రెంటల్‌ హౌసింగ్ కాంప్లెక్స్‌(ఏఆర్‌‌హెచ్‌‌సీ) స్కీమ్‌‌లో ఫారిన్ ‌‌డైరక్ట్ ‌ఇన్వెస్ట్ ‌మెంట్ల(ఎఫ్‌‌డీఐ) ను ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో పనుల కోసం పట్టణాల కొచ్చిన వలస కార్మికులకు, పేదవాళ్ల‌కు, విద్యార్ధులకు అఫరబుల్‌‌ ధరలోనే ఇళ్ల‌ను రెంట్‌కి వ్వడానికి మరింతగా వీలుంటుందని చెబుతోంది. రెంటల్ ‌హౌసింగ్‌‌ సెగ్మెంట్‌‌లోకి ఎఫ్‌‌డీఐలు రావాలని మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌‌, అర్బన్ ‌‌అఫైర్స్‌ సెక్రటరీ దుర్గా శంకర్ ‌‌మిశ్రా అన్నారు. ఇతర అఫరబుల్ ‌‌ హౌసింగ్ ‌‌ప్రాజెక్ట్ లో‌ ఎఫ్‌‌డీఐలు వస్తున్నాయని, రెంటల్ ‌‌హౌస్‌ సెగ్మెంట్‌‌లో కూడా వీటిని ప్రొత్సహించాలని చెప్పారు. అన్నిరకాల ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో తీర్చి దిద్దేందుకు లోన్స్‌ను తక్కువ వడ్డీకే అందుబాటులో ఉండేలా చేస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రధానమంత్రి ఆవాస్ ‌యోజన(పీఎంఏవై–అర్బన్‌‌) లో భాగంగా సిటీలకు వలస వెళ్లిన‌ వారి కోసం అఫరబుల్‌‌ రెంటల్ ‌‌హౌసింగ్ కాంప్లెక్స్‌ (ఏ ఆర్‌‌హెచ్‌‌సీ)లను ఏర్పాటు చేయాలని ఓ స్కీమ్‌‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌‌లో భాగంగా ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్ల‌ను ఈ ఏఆర్‌‌హెచ్‌‌సీ కింద పీపీపీ మోడ్‌‌లో కన్వర్ట్ చేస్తారు. 25 ఏళ్ల కన్సెషనరీ అగ్రిమెంట్‌‌ ద్వారా ఆ ప్రాజెక్టులను ఏఆర్‌‌హెచ్‌‌సీ కింద మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌‌ కంపెనీలు, ఇన్‌‌స్టిట్యూషన్లతో కూడా అగ్రిమెంట్లు కుదుర్చుకుంటామని కేంద్రం చెబుతోంది.

3.5 లక్షలమందికి లబ్ధి ..

తమ సొంత ల్యాండ్‌‌లోఏ ఆర్‌‌హెచ్‌‌సీలను డెవలప్ ‌చేసిన రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు, ప్రైవేట్ ‌‌సంస్థలకు కేంద్రం ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఈ స్కీమ్‌‌ ద్వారా ఏకంగా 3.5 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనాలు పొందుతారని ప్రభుత్వం చెబుతోంది. మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీలో పనిచేసేవారు, వివిధ సెక్టారలో్ల సర్వీస్‌‌ను ప్రొవైడ్ ‌చేసేవారు, కన్‌‌స్ట్రక్షన్‌‌, ఇతర సెక్టారకు్ల చెందిన వర్కర్లు ఈ స్కీమ్‌‌ ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. అఫరబుల్‌‌ హౌసింగ్‌‌లలా కాకుండా రెంటల్ ‌‌హౌసింగ్ ‌‌ఒకరి నుంచి వేరొకరికి మారుతూ ఉంటుందని దుర్గా శంకర్ ‌‌అన్నారు. అగ్రిమెంట్లపై సంతకాలు చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. వీరితో పాటు ప్రైవేట్‌ కంపెనీలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించామని, వారికి మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్‌‌ను పంపామని అన్నారు. ఒక సారి వీరికి అనుమతి వస్తే తర్వాత ఎక్స్‌ప్రెషన్ ‌‌ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ను అన్ని రాష్ట్రాలకు పంపుతామని చెప్పారు. కరోనాతో ఈ పనులన్ని నిలిచిపోయాయని, ఇంకో నెలలో అగ్రిమెంట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేస్తాయని అంచనావేశారు. ఈ స్కీమ్ ‌‌కింద పట్టణాలకు వలస వచ్చినవారికి తమ పనులకు దగ్గరనే ఇళ్ల‌ను ప్రొవైడ్ ‌‌చేయాలని ప్రభుత్వం చూస్తోంది.