నెమళ్లు, జింకను వేటాడిన ఇద్దరి అరెస్ట్..పరారీలో మరో ఇద్దరు వేటగాళ్లు

నెమళ్లు, జింకను వేటాడిన ఇద్దరి అరెస్ట్..పరారీలో మరో ఇద్దరు వేటగాళ్లు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడిన వారిని అటవీశాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎఫ్​డీవో చిన్న విశ్వనాథ్​తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నిలేశ్, రోషన్​ భోరజ్​ మండలంలోని గిమ్మకు చెందిన రాథోడ్​ సందీప్, జైనథ్​కు చెందిన సంజీవ్​ కలిసి మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో నాలుగు నెమళ్లు, ఒక జింకను వేటాడారు. 

వాటిని భోరజ్​లో అమ్ముతుండగా పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు నిలేశ్, రోషన్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు నెమళ్ల కళేబరాలు,  జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.