ఇండియా ఫారెస్ట్.. అటవీ వనరులు

ఇండియా ఫారెస్ట్.. అటవీ వనరులు

అడవుల వల్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యక్షంగా జాతీయ ఉత్పత్తికి, ఉపాధికి దోహదపడుతుంది. పశుసంపదకు దానాను అందిస్తుంది. పరిశ్రమలకు, ఇంటి అవసరాలకు కలపను అందిస్తుంది. కొన్ని పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తుంది. అడవులు మైనర్​ ఉత్పత్తులను కూడా అందిస్తుంది. కొన్ని అటవీ ఉత్పత్తులు విదేశీ మార్కెట్​లో కూడా డిమాండ్​ కలిగి ఉన్నాయి. 

అడవులు పరోక్ష ప్రయోజనాన్ని ఇస్తాయి. వాతావరణాన్ని సమతౌల్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. వర్షపాతానికి దోహదపడుతుంది. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతుంది. నేల కోతను తగ్గిస్తుంది. వరదల తీవ్రతను తగ్గిస్తుంది. అడవుల ద్వారా ప్రవహించే నీటి వల్ల భూసారం పెరుగుతుంది. అడవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే అడవులపై చేసే పెట్టుబడిని గ్రీన్​ క్యాపిటల్​ అంటారు. 

ఇండియన్​ ఫారెస్ట్​ రిపోర్ట్​–2021 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 7.14 లక్షల చదరపు కి.మీ. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71 శాతం. దీనికి చెట్లతో కూడుకున్న ప్రాంతాన్ని కూడా కలిపితే 8,09,537 చ.కి.మీ.లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62 శాతం. ఐఎస్​ఎఫ్​ఆర్ 2019తో పోల్చితే ఐఎస్ఎఫ్​ఆర్ 2021లో అడవులు 1540 చ.కి.మీ.(0.22 శాతం), చెట్లు 721 చ.కి.మీ. (0.76 శాతం), అడవులు, చెట్లు కలిపి 2,261 చ.కి.మీ. (0.28 శాతం) పెరిగింది. 

అడవుల విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలు 1. ఆంధ్రప్రదేశ్​ (647 చ.కి.మీ.), 2. తెలంగాణ (632 చ.కి.మీ.),3.  ఒడిశా (537 చ.కి.మీ.),4. కర్ణాటక (155 చ.కి.మీ.), 5. జార్ఖండ్​ (110‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చ.కి.మీ.). కొండ ప్రాంత జిల్లాల్లో  భౌగోళిక విస్తీర్ణంలో 40.17 శాతం అడవులు ఉన్నాయి. గిరిజన ప్రాంత జిల్లాల్లో 37.53 శాతం అడవులు ఉన్నాయి. ఈశాన్య భారతదేశ  ప్రాంత భౌగోళిక విస్తీర్ణంలో 65 శాతం అడవులు ఉన్నాయి. మాంగ్రూవ్​ అడవులు గత గణాంకాలతో పోలిస్తే 0.34 శాతం పెరిగాయి.  ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రష్యా .ప్రపంచ అడవుల్లో 20 శాతం వాటా కలిగి ఉంది. రష్యా విస్తీర్ణంలో అడవుల శాతం 49.8 శాతం. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్​ (12 శాతం) . కానీ, బ్రెజిల్​ విస్తీర్ణంలో  అడవుల శాతం 59.4 శాతం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అడవులు శాతం 2.  

2021 అటవీ గణాంకాల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవుల శాతం 33 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 75 శాతం పైగానే అడవులు ఉన్నాయి. దేశంలో అడవుల వ్యాప్తి ఒకే రీతిన లేదు. మధ్యప్రదేశ్, అరుణాచల్​ప్రదేశ్​ తదితర ప్రాంతాల్లో అడవులు కేంద్రీకృతమై ఉన్నాయి. తలసరి అడవుల విస్తీర్ణం అమెరికాలో 1.8 హెక్టార్లు ఉండగా, ప్రపంచ సగటు అడవుల లభ్యత 0.640 శాతం  హెక్టార్లు. 

కాగా, భారతదేశ సగటు  అడవుల లభ్యత 0.064 హెక్టార్లు. దేశంలో చిత్తడి నేలల్లో గుజరాత్​ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్​, ప్రపంచ మాంగ్రూవ్​ అడవుల్లో ఎక్కువ అడవులు ఆసియా ఖండంలో ఉన్నాయి. ఇండోనేషియాలో ఎక్కువ శాతం ఉన్నాయి. మాంగ్రూవ్​ అడవుల పెరుగుదల ఒడిశాలో ఎక్కువగా ఉంది. అయితే, మాంగ్రూవ్​ అడవులు ఎక్కువగా పశ్చిమబెంగాల్​లో ఉన్నాయి. మొత్తం మాంగ్రూవ్​ అడవుల్లో 1. పశ్చిమబెంగాల్​ (42.33 శాతం), 2. గుజరాత్​ (23.54 శాతం), 3.అండమాన్​ (12.34 శాతం), 4.ఆంధ్రప్రదేశ్​ (8.11 శాతం)ల్లో ఉన్నాయి. పశ్చిమబెంగాల్​లో దక్షిణ 24 పరిగణాలు, గుజరాత్​లోని కచ్​ జిల్లాల్లో మాంగ్రూవ్​ అడవులు ఎక్కువగా ఉన్నాయి.

అధిక సాంద్రత గల అడవులు    99,779 చ.కి.మీ.    3.04 శాతం    
మితమైన సాంద్రత గల అడవులు    3,06,890 చ.కి.మీ.    9.33 శాతం
బహిరంగ అడవులు    3,07,120 చ.కి.మీ.    9.34 శాతం
మొత్తం అటవీ విస్తీర్ణం    7,13,789 చ.కి.మీ.    21.71 శాతం
చెట్లు ఉన్న ప్రాంతం    95,748 చ.కి.మీ.    2.91 శాతం
మొత్తం అడవులు, చెట్లు విస్తీర్ణం    8,09,537 చ.కి.మీ.    24.62 శాతం
స్క్రబ్​    46,539 చ.కి.మీ.    1.42 శాతం
నాన్ ఫారెస్ట్​    25,27,141 చ.కి.మీ.    76.87శాతం
మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణం    32,87,469 చ.కి.మీ.    100 శాతం