అసోం మాజీ సీఎం ఆరోగ్యం విషమం

అసోం మాజీ సీఎం ఆరోగ్యం విషమం

గువాహటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసోం మాజీ సీఎం  తరుణ్ గోగోయ్  ఆరోగ్య పరిస్థితి విషమించింది. గత నెలలో అస్వస్థతకు గురైన ఆయనను గువాహటి మెడికల్ కాలేజీకి తరలించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.  ప్రయోగాత్మకంగా విజయవంతం అవుతున్న ప్లాస్మా థెరపీ చికిత్స అందించడంతో తరుణ్ గోగోయ్ కోలుకున్నట్లు కనిపించారు. దీంతో గత నెల 25న డిశ్చార్జి చేశారు. 85 ఏళ్ల తరుణ్ గోగోయ్ అసోం రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించామని ఆయన తనయుడు ఎంపీ గౌరవ్ గోగోయ్ వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న ఆయనకు తొమ్మిది మంది నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తోంది.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం