రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దు

రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దు

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు. ‘న్యాయం, అధికారం అందరికీ సమానంగా ఉండాలి. రాజ్యాంగం కాగితాలకే పరిమితం కాకుండా చూసే బాధ్యత మనందరి పైనా ఉంది. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. 

కాగా, పార్లమెంట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ ఈ సెలబ్రేషన్స్ కు కాంగ్రెస్ సహా 14 విపక్ష పార్టీలు డుమ్మా కొట్టాయి. ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీద ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తృణమూల్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్.. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా

ఒకే కుటుంబం పార్టీని తరాల పాటు నడిపిస్తే ఎలా?

అత్యాచారంతో పుట్టిందని బిడ్డను చంపుకుంది