కోహ్లీ, రోహిత్లకు ఇదే చివరి టీ-20 వరల్డ్ కప్ !

కోహ్లీ, రోహిత్లకు ఇదే చివరి టీ-20 వరల్డ్ కప్ !

విరాట్ కోహ్లీ..రోహిత్ శర్మ ఒకరు మాజీ కెప్టెన్ మరొకరు తాజా కెప్టెన్. అయితే త్వరలో టీ-20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..మాజీ క్రికెటర్లు ఈ ఇద్దరికి ఇదే చివరి ప్రపంచ కప్ అంటున్నారు. 
పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే కోహ్లీ, రోహిత్లు రాణిస్తేనే జట్టులో ఉంచాలి..లేదంటే జట్టు నుంచి తప్పించేయాల్సిందే అంటున్నాడు. ముఖ్యంగా అక్టోబర్లో టీ-20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో..ఈ ఇద్దరు చెలరేగాలని సూచిస్తున్నాడు. లేదంటే..వీరికి ఇదే చివరి టీ-20 వరల్డ్ కప్ అవుతుందని హెచ్చరిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరు ప్లేయర్లు సరైన ఫాంలో లేరని..దీంతో మెగా టోర్నీకి ముందు వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందంటున్నాడు. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ల ద్వారా మళ్లీ ఫాంలోకి రావాలని చెబుతున్నాడు.

అక్తర్ కరెక్ట్ చెప్పాడు..
షోయబ్ అక్తర్ వాఖ్యలతో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏకీభవించాడు. రోహిత్, కోహ్లీలు ఐపీఎల్ 2022లో రాణించకపోవడం వారికి మైనస్ పాయింట్ అన్నాడు హర్భజన్ సింగ్. అయితే ఇద్దరికి ఐపీఎల్ కంటే టీ20 వరల్డ్ కప్ ముఖ్యమని చెప్పాడు. ప్రపంచ కప్ గెలుస్తామన్న ధీమాతో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారని తెలిపాడు. అయితే ప్రస్తుతం టీమిండియా రిజర్వ్ బెంచ్ యంగ్ ఆటగాళ్లతో నిండి ఉన్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ రాణించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నాడు. ఒకవేళ ఇద్దరు విఫలమైతే మాత్రం..వారికిదే చివరి ప్రపంచ కప్ అవుతుందని హెచ్చరించాడు. 

ఐపీఎల్లో ఫెయిల్..
ఐపీఎల్ 2022లో కోహ్లీ, రోహిత్ దారుణంగా విఫలమయ్యారు. బెంగుళూరు తరపున ఆడిన కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 22.73 సగటుతో 341 పరుగులే చేయగా.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు. అయితే  డుప్లెసిస్, దినేష్ కార్తీక్తో పాటు ఇతర ఆటగాళ్లు రాణించడంతో..అర్సీబీ కనీసం ప్లేఆఫ్ చేరింది. కానీ..నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ అత్యంత చెత్తగా ఆడింది. ఎన్నడు లేని విధంగా చివరి స్థానంతో నిలిచింది. 

మరిన్ని వార్తల కోసం..

దినేష్ కార్తీక్కు సౌతాఫ్రికా సిరీస్ డూ ఆర్ డై

పాన్ ఇండియా మూవీని ప్రారంభించిన ఉపేంద్ర