
గౌహతి: బిహార్ మాజీ గవర్నర్, త్రిపుర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవానంద్ కొన్వార్ (86) అనారోగ్యంతో చనిపోయారు. బిహార్ కు 2009వ సంవత్సరం, జూలై 24 నుంచి 2013 మార్చి 8 వరకు గవర్నర్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. త్రిపురకు 2014 మార్చి 25 నుంచి 2014 జూన్ 29 వరకు.. బెంగాల్ కు డిసెంబర్ 2009 నుంచి జనవరి 2010 వరకు గవర్నర్ (అడిషనల్ చార్జి)గా కూడా సేవలు అందించారు. 1955లో కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ నేతగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి.. హితేశ్వర్ సైకియా, తరుణ్గొగోయ్ అస్సాంకు ముఖ్యమంత్రులుగా ఉన్న టైమ్ లో కేబినెట్ మినిస్టర్ గా కొన్వార్ సేవలు అందించారు. ఆయన మరణంపై అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీ, సీఎం సర్బానంద సోనోవాల్ సంతాపం వ్యక్తం చేశారు.