హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ కన్నుమూత

హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ కన్నుమూత

హైదరాబాద్: మాజీ ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) శనివారం కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయినట్లు సమాచారం. ఈ హైదరాబాదీ యువ క్రికెటర్ అశ్విన్ యాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టారు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. చివరిగా 2009లో ముంబైతో రంజీ మ్యాచ్ ఆడారు. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది.