పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని..?: ఆకునూరి మురళి

పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని..?: ఆకునూరి మురళి

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ డెమొక్రాటిక్ ఫోర్ నేత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రాన్ని వదలి పొరుగు రాష్ట్రంలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లకు తెలంగాణలో ఏం పని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో ఏం పని..? అని ప్రశ్నించారు. కడప జిల్లాకు చెందిన షర్మిల, భీమవరంకు చెందిన పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని అన్న ఆకునూరి వారు బాగా డబ్బుందని రాజకీయ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించారు. వాళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది..? ఏం వ్యాపారాలు చేశారంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అదంతా అవినీతి డబ్బే కదా అని అభిప్రాయపడ్డారు.