భారత మహిళల హాకీ మాజీ చీఫ్ కోచ్‌ గురుదియాల్‌‌ సింగ్‌‌ భాంగు‌ మృతి

భారత మహిళల హాకీ మాజీ చీఫ్ కోచ్‌ గురుదియాల్‌‌ సింగ్‌‌ భాంగు‌ మృతి

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టుకు 2002 కామన్వెల్త్‌‌ క్రీడల్లో గోల్డ్​ మెడల్​  అందించిన మాజీ చీఫ్‌‌ కోచ్‌‌ గురుదియాల్‌‌ సింగ్‌‌ భాంగు (86) కన్నుమూశారు. కెనడాలోని సర్రేలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు హాకీ ఇండియా వెల్లడించింది. 2002 మాంచెస్టర్‌‌ కామన్వెల్త్‌‌ క్రీడల ఫైనల్లో భారత్‌‌ 3–2తో ఇంగ్లండ్‌‌ను ఓడించి చరిత్ర సృష్టించడంలో భాంగు వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి.   ఈ ఘట్టమే 2007లో విడుదలైన షారుఖ్‌‌ ఖాన్‌‌ చిత్రం ‘చక్‌‌ దే ఇండియా’ కథకు స్ఫూర్తిగా నిలిచింది. 1998లో భారత మహిళల జట్టు కోచ్‌‌గా బాధ్యతలు చేపట్టిన భాంగు.. అదే ఏడాది ఆసియా క్రీడల్లో జట్టుకు రజతం అందించారు. 2000లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి హాకీ కోచ్‌‌గా గుర్తింపు పొందారు.