ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. : హరీశ్ రావు

ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. : హరీశ్ రావు
  • మాజీ మంత్రి హరీశ్ రావు 

 సిద్దిపేట, వెలుగు: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు  అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20 వ వార్డులో పార్టీ ఆఫీసును ప్రారంభించి మాట్లాడారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండానే అని, కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్​దే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు.

 ప్రతి వార్డ్ లో పార్టీ ఆఫీసు ఏర్పాటుచేసి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​పార్టీ లో పలువురు యువకులు చేరగా వారికి హరీశ్ రావు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో అమర్​నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులను, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సన్మానించారు.