2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తాం

V6 Velugu Posted on Jun 17, 2021

సిద్దిపేట: హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌‌కు ప్రజ్ఞాపూర్, సిద్దిపేట రహదారిలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈటలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. 

‘తెలంగాణలోని గ్రామగ్రామాన, వాడవాడలా బీజేపీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తా. కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండి సేవ చేస్తా. గజ్వేల్‌లో ఆనాడు నేను ఉద్యమంలో చేరా. సొంత నియోజకవర్గంతోపాటు ఇక్కడి ప్రజానీకంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం. హుజురాబాద్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడితో కలసి గ్రామాలను పర్యటిస్తా’ అని ఈటల పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, స్వామి గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్‌‌లు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని రంగదాంపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన ఈటల.. ఆ తర్వాత హుజురాబాద్‌‌కు బయలుదేరి వెళ్లారు. 

Tagged etela rajender, siddipet, Huzurabad, Former mp vivek venkataswamy, MLA Raghunandan Rao, Swamy goud

Latest Videos

Subscribe Now

More News