
రాయికల్, వెలుగు: తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వీరాపూర్ గ్రామస్తుల సమస్యను తక్షణం పరిష్కరించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం వీరాపూర్ గ్రామానికి మాజీ మంత్రి వెళ్లగా మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆనంతరం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడారు.
గ్రామంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టులను పరిశీలించి రిపేర్లు చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అంతకుముందు పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు సోమ వెంకటేశ్, గంగాధర్, మహేశ్, నర్సారెడ్డి, రాయికల్ పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు రాజేశం,ఉపాధ్యక్షుడు గంగాధర్, ఇతర లీడర్లు నరేశ్, నర్సయ్య, సతీశ్, రామస్వామి, పాల్గొన్నారు.