
ఆమనగల్లు, వెలుగు: పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ రింగ్ రోడ్ వంకర టింకరగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నిర్మాణంలో అలైన్మెంట్లు మార్చడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పాత అలైన్ మెంట్ తో 500 మంది రైతులు మాత్రమే భూములు కోల్పోతారని, కొత్త అలైన్మెంట్ తో 1,500 మంది రైతులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైతే ఇన్నర్ రోడ్లను డెవలప్ చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.