అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే మృతి
  • సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చేకూరి కాశయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేతగా చేకూరి తనదైన ముద్ర వేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. చేకూరి కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్జున్ని రాష్ట్రం కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. దివంగత చేకూరి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాశయ్య 1978లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి వనమా వెంకటేశ్వర రావు మీద గెలుపొందారు. కాశయ్య ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జన్మించారు.