వంద స్కీములు ప్రవేశపెట్టినా కేసీఆర్ను నమ్మరు

వంద స్కీములు ప్రవేశపెట్టినా కేసీఆర్ను నమ్మరు

మునుగోడు తీర్పుతో కేసీఆర్ పతనం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్లుగా ఫామ్ హౌస్ నుండి రాని కేసీఆర్.., మునుగోడు ఉప ఎన్నిక దెబ్బతో అన్ని నియోజకవర్గాలు తిరుగుతుండని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా వంద స్కీములు ప్రవేశపెట్టినా..ప్రజలు కేసీఆర్ను నమ్మరని తెలిపారు. 

ప్రజల ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉపఎన్నిక రాబోతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రి జగదీష్ రెడ్డి తిరుగుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తిరిగినా..మునుగోడు ప్రజలను ఒప్పించడం వారి తరం కాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ సమస్య గురించి మూడుసార్లు సీఎం అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదన్నారు. ఇవాళ ఉప ఎన్నిక రాగానే..మునుగోడులో మూడవ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నారని చెప్పారు.