కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

హసన్‌‌పర్తి, వెలుగు : కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌‌ చెప్పారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలోని 56, 64 డివిజన్లకు చెందిన పలువురు సోమవారం బీజేపీలో చేరగా, వారికి శ్రీధర్‌‌ కండువాలు కప్పి ఆహ్వానించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను లీక్‌‌ చేయించిన ఘనత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డివిజన్‌‌ అధ్యక్షులు నాగవెల్లి రమేశ్‌‌, మందోటి మహేందర్‌‌రెడ్డి, హనుమకొండ జిల్లా కిసాన్‌‌ మోర్చా ప్రధాన కార్యదర్శి అమృతరావు పాల్గొన్నారు.