పార్టీ మారే ప్రసక్తే లేదు : మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి

పార్టీ మారే ప్రసక్తే లేదు  : మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌‌‌‌యాదవ్‌‌‌‌, జనార్దన్‌‌‌‌రెడ్డి, హర్షవర్దన్‌‌‌‌రెడ్డి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఏ పార్టీలో విలీనం చేసినా అందులోనే కొనసాగుతా
  • కేటీఆర్‌‌‌‌ వద్దంటే వ్యాపారం చేసుకుంటా : మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు : తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి హర్షవర్దన్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతమని, తాము మాత్రం చివరి దాకా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లోనే కొనసాగుతామని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఏ పార్టీలో విలీనం చేసినా అందులోనే కొనసాగుతానని, కేటీఆర్‌‌‌‌ వద్దంటే వ్యాపారం చేసుకుంటానని నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌ చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌పై మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మాజీమంత్రి హరీశ్‌‌‌‌రావు ఇచ్చిన పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌ను జిల్లా పార్టీ ఆఫీసులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తిలకించారు. అనంతరం ఈ ముగ్గురు మీడియాతో మాట్లాడారు.