ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే సీఎం వద్దు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఫామ్ హౌస్ కు  పరిమితమయ్యే సీఎం వద్దు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్/కామేపల్లి/పాల్వంచ/మణుగూరు/నేలకొండపల్లి, వెలుగు :  రాష్ట్రానికి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే సీఎం వద్దని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ధనం పక్షాన ఉంటుందని, కాంగ్రెస్​ మాత్రం ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కామేపల్లి మండలం ఊట్కూరులో భారీ ర్యాలీ  చేపట్టారు.

అక్కడే పార్టీ జిల్లా నాయకుడు ఏపూరి మహేందర్ అధ్యక్షత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడారు. నెలలో మూడు రోజులు కూడా బయటికి రాని సీఎం కేసీఆర్​ అన్నారు. కేసీఆర్​కు దేశ సంపదను ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప సామాన్య ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేసిన బీఆర్​ఎస్​ పాలకులకు ఇక నుంచి ఇండ్లకే పరిమితం కానున్నారన్నారు. అనంతరం పలువురు బీఆర్​ఎస్​ నాయకులతోపాటు 300 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి.  ఖమ్మం రూరల్​ మండలం ఆరెకోడులో పొంగులేటి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియాయకాల కోసం ఉద్యమం చేశామని చెబుతున్న ప్రబుద్ధుడు కేసీఆర్​ ప్రజలను విస్మరించారని మండిపడ్డారు.

తన కుటుంబ సంపాదనే ఎజెండాగా పెట్టుకుని రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఆరు ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఆరోపించారు. వీళ్ల అక్రమాలకు పులిస్టాఫ్ పెట్టే సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. 

పొత్తు ధర్మాన్ని పాటించాలి  

తెలంగాణ రాష్ట్రంలోని 108 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రె స్ అభ్యర్థులకు మద్దతునిస్తున్న సీపీఐకి కాంగ్రెస్ కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ఇచ్చి పొత్తు ధర్మాన్ని పాటించాలని పొంగులేటి పిలుపు నిచ్చారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగా పాత పాల్వంచలోని కొత్వాల నివాసంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. కొత్తగూడెం సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన కూనంనేని సాంబశివ రావుకు కాంగ్రెస్ శ్రేణులు చిత్త శుద్ధితో పనిచేసే భారీ మెజారిటీ తీసుకురావాలని కోరారు. 

కేసీఆర్​వి పగటి కలలు 

మూడోసారి ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పొంగులేటి అన్నారు. మణగూరు పట్టణంలోని టీడీపీ సెంటర్ వద్ద శుక్రవారం జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. దోపిడీ, దోరల పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరారు.