పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్‌కు గుండెపోటు

V6 Velugu Posted on Sep 28, 2021

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రపంచ ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యాడు. గత మూడు రోజులుగా ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. నిన్న(సోమవారం) తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన లాహోర్ లోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు గుండెపోటు వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం ఆయనకు యాంజియోప్లాస్టీని డాక్టర్లు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. 
 

Tagged Former Pakistan captain, Inzamam-ul-Haq, suffers heart attack, angioplasty

Latest Videos

Subscribe Now

More News