
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఆదేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఆదాయ వివరాలు దాచిపెట్టిన కేసులో ఈసీ చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రిగా ఉండగా వేర్వేరు దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన కానుకల్ని పాకిస్థాన్ ప్రభుత్వంలోని తోషాఖానా నుంచి తక్కువ ధరకు ఇమ్రాన్ ఖాన్ కొనుగులు చేశారు. అయితే వాటిని విక్రయించడం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనేది ఇమ్రాన్ ఖాన్ వెల్లడించలేదు. దీనిపై సంకీర్ణ ప్రభుత్వంలోని కొంత మంది ఎంపీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ పై వేటు వేసింది.
ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఈసీ భవనాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై ఇమ్రాన్ మద్దతుదారులు కాల్పులు జరిపారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.