అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు

 అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి అరెస్టు

అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధుసింగ్ ధరమ్‌సోత్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. మంగళవారం తెల్లవారుజామున ధరమ్‌సోత్‌ అరెస్ట్‌ జరిగింది. ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో అటవీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు సాధుసింగ్ లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చెట్లను నరికివేసినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చెల్లించారని ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన అవినీతి నిర్మూల‌న చ‌ర్యల్లో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో సాధుసింగ్ ని అరెస్టు చేసింది.  మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం హెచ్చరించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

అవినీతి నిరోధక చట్టంలోని పలు సంబంధిత సెక్షన్ల కింద సాధుసింగ్ పై కేసు నమోదు అయింది. మంత్రిగా ఉన్న సమయంలో సాధుసింగ్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌,  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల కోసం కూడా డబ్బులు తీసుకునేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా సాధుసింగ్ అరెస్టుని రాజకీయ ప్రతీకార చర్యగా పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా అభివర్ణించారు. 

మరిన్ని వార్తలు..

 

 

సింగర్ సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

ఎవరీ నుపుర్ శర్మ..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?