ఎవరీ నుపుర్ శర్మ..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 

ఎవరీ నుపుర్ శర్మ..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 
  • మొహమ్మద్‌ ప్రవక్తపై నుపుర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • బీజేపీ నుంచి సస్పెండ్ కు గురైన నుపుర్ శ‌ర్మ‌
  • నూపుర్ శ‌ర్మ‌, నవీన్ జిందాలపై బీజేపీ వేటు
  • అరబ్ దేశాల్లో నూపుర్ శ‌ర్మ‌పై చిచ్చు
  • నూపుర్, నవీన్ పై చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్

మొహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్‌ శర్మ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఇస్లాం మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌వ‌క్త‌పై ఓ టీవీ చ‌ర్చ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేసి తీవ్ర వివాదాన్ని రేపారు. నుపుర్ వ్యాఖ్యలపై ఇస్లామిక్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ గా స్పందించింది. నుపుర్‌ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలింతకు ఈ నుపుర్ శర్మ ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అరబ్ దేశాలతో పాటు ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి. 

ఎవరీ నుపుర్ శర్మ..? 

1985 ఏప్రిల్ 23న నుపుర్ శర్మ జన్మించారు. ఉన్న విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. నుపుర్ తల్లిది డెహ్రాడూన్‌. 
ఢిల్లీలోని మథురా రోడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 
ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థిక‌శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశారు. 
2010లో లా-ఫ్యాకల్టీ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశారు. 
లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో లా స‌బ్జెక్ట్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు.

రాజకీయాల్లో చురుగ్గా నుపుర్ 

కాలేజీ రోజుల నుంచి నుపుర్ శర్మ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2008లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టిక్కెట్‌పై పోటీ చేసిన ఆమె... ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ నేత, ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 31,000 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ పై ఓడిపోయింది. అరవింద్ ప్రధాన్, అరుణ్ జైట్లీ, అమిత్ షా వంటి బీజేపీ సీనియర్ నాయకులతోనూ కలిసి పని చేశారు. బీజేపీ యువ‌మోర్చాలో అనేక కీల‌క హోదాల్లో ప‌ని చేశారు.  2017లో మనోజ్ తివారీ నేతృత్వంలోని బీజేపీ ఢిల్లీ విభాగానికి అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. 2020 సెప్టెంబ‌ర్‌లో జేపీ న‌డ్డా బృందంలోకి వెళ్లడంతో జాతీయ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు. టీచ్ ఫ‌ర్ ఇండియా యూత్ అంబాసిడ‌ర్‌గా నుపుర్ శర్మ కొన‌సాగుతున్నారు. బీజేపీలో ఉంటూ ఇప్పటి వరకు అనేక పదవులు చేపట్టారు.