ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
  •     మల్లాపురం మాజీ సర్పంచ్ వెంకటయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : నకిలీ పత్రాలు సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని మల్లాపురం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయడం కోసమే కొందరు నాయకులు నల్లబోలు ఇండస్ట్రిస్ ఎండీ ధర్మారెడ్డితో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని తెలిపారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

తనతోపాటు మల్లాపురం మాజీ ఎంపీటీసీ కర్రె విజయ కలిసి గతేడాది ఆయేషా అనే ముస్లిం మహిళ నుంచి న్యాయబద్ధంగానే భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. పాస్ బుక్కుల ఆధారంగానే తాము ఆమె భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ఆయేషాకు ప్రభుత్వం జారీ చేసిన ధరణి పాస్ బుక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేతప్ప తాము ఎలాంటి తప్పుడు పత్రాలు సృష్టించలేదని మీడియాకు భూమికి సంబంధించిన పత్రాలను చూపించారు.