
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం హైస్కూల్‌లో 1995–96లో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు తోటి ఫ్రెండ్స్ కుటుంబాలకు సాయం చేశారు. పూర్వ విద్యార్థుల్లో ముగ్గురు వివిధ కారణాలతో చనిపోయారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పూర్వ విద్యార్థులు తలా కొంత వేసుకున్నారు. సోమవారం మూడు కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.లక్ష చొప్పున అందజేసి దాతృత్వం చాటుకున్నారు.