నార్కట్ పల్లి, వెలుగు : మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 280లో ఉన్న 10 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి డిమాండ్చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఈ ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేశారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998లో టీడీపీ హయాంలో నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 200 మందికి పైగా పట్టాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ప్రభుత్వం ఈ భూమిని ఇల్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు దండు రవి, శాఖ కార్యదర్శి దండు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.