కొడంగల్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తున్నది. అందులోభాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ సేవలో పాలుపంచుకోవడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలో సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ లో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే 28వేల మంది స్టూడెంట్లకు నిరుడు నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నది. ఈ స్కీమ్ సక్సెస్ కావడంతో అదే తరహాలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
ఇయ్యాల్నే వన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌కు శంకుస్థాపన
దుద్యాల మండలం హకీంపేట్‌లో సుమారు 250 ఎకరాల్లో నిర్మించే వన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం, అలాగే.. పోలేపల్లి, లగచర్ల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించనున్నారు. వీటికి కొడంగల్ నుంచే సీఎం రేవంత్ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ, సైనిక్ స్కూల్, నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ కాలేజీలు కొలువుదీరనున్నాయి.
