
కరీంనగర్ సిటీ, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందున్న జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.15లక్షలతో సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు దన్నసింగ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ చాంద్, మల్లికార్జున్, వరాల నర్సింగం, తిరుమల, లత, లచ్చన్న, అశోక్, స్వప్న, శ్రీధర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రాజేందర్, వెంకన్న, రవీందర్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.