బెంగాల్ సఫారీలోని ఎన్‌క్లోజర్‌లోకి నాలుగు పులి పిల్లలు రిలీజ్

బెంగాల్ సఫారీలోని ఎన్‌క్లోజర్‌లోకి నాలుగు పులి పిల్లలు రిలీజ్

సిలిగురి సమీపంలోని బెంగాల్ సఫారీలోని ఓపెన్ ఎన్‌క్లోజర్‌లోకి నాలుగు పులి పిల్లలను అధికారులను  విడుదల చేశారు. ఆరు నెలల వయసున్న ఈ పులి పిల్లలను రిలీజ్ చేయడానికి అనువైన సమయంగా భావించిన అధికారులు... జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దాదాపు ఆరేళ్లుగా పార్కులో ఉన్న షిలా అనే పులి ఈ ఏడాది మార్చి 22న ఈ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శిలా, రిక, కికా, తేజల్, తార అనే ఐదు ఆడ పులుల ఉన్నాయి.  వీటితో పాటు పార్క్‌లో బివాన్ అనే ఒక పురుష పులి ఉండేది. ఇప్పుడు శివ, సెరా, T1, T2, T3తో కలిపి పార్క్‌లో ఆరు మగ పులులున్నాయి.

పులుల ప్రవర్తనను స్టడీ చేశాకే అటవీ అధికారుల సమక్షంలో ఈ నాలుగు పులి పిల్లలను విడుదల చేశామని బెంగాల్ సఫారీ పార్క్ డైరెక్టర్ దేవా సంగ్ము షెర్పా తెలిపారు. తాము మార్చి 22, 2022న జన్మించిన నాలుగు పులి పిల్లలను విడుదల చేసామన్న ఆమె... జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి అధికార యంత్రాంగం విడుదలకు ముందు కొన్ని ట్రయల్స్ నిర్వహించిందని చెప్పారు. ఈ పని తమకు చాలా సాధారణమని... అందుకే ఇప్పుడు రిలీజ్ చేశామని తెలిపారు. దీని వల్ల పార్కులో పిల్లలకు, సందర్శకులకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, సఫారీలో ప్రజలు ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారని షెర్పా విశ్వాసం వ్యక్తం చేశారు.