జనం దగ్గర అప్పులే : 40 శాతం డబ్బు.. ఒక్క శాతం ధనవంతుల దగ్గరే ఉంది..

జనం దగ్గర అప్పులే : 40 శాతం డబ్బు.. ఒక్క శాతం ధనవంతుల దగ్గరే ఉంది..
  • మరింత పెరిగిన ధనవంతుల సంపద 
  • వెల్లడించిన వరల్డ్‌‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ రిపోర్ట్

న్యూఢిల్లీ: పదేళ్ల కిందట నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక  దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం మరింత పెరిగింది. ధనవంతులు  మరింత ధనవంతులయ్యారు. దేశంలో ధనవంతులు, పేదల మధ్య గ్యాప్ గత 60 ఏళ్లలో ఇప్పుడే ఎక్కువగా ఉందని రీసెర్చ్ సంస్థ వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది.  మెజార్టీ సంపద కేవలం ఒక శాతం మంది ప్రజల దగ్గరే ఉందని ,  బ్రెజిల్‌‌, యూనిటైడ్ స్టేట్స్‌‌లో కంటే ఇండియాలోనే  ఈ గ్యాప్ ఎక్కువగా ఉందని తెలిపింది. 

విదేశీ పెట్టుబడులకు 1992 లో ఇండియా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి దేశంలో బిలియనీర్ల సంఖ్య నిలకడగా పెరుగుతోంది.  2023  నాటికి దేశంలోని 40.1 శాతం సంపద.. కేవలం ఒక శాతం మంది ఉన్న  ధనవంతుల చేతుల్లో ఉందని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌‌  స్టడీ చేసిన నితిన్ కుమార్‌‌‌‌ భారతి, థామస్‌‌ పికెట్టి పేర్కొన్నారు. 1961 తర్వాత ఇదే హయ్యెస్ట్ అని వెల్లడించారు. 

ALSO READ ; ఇండియాలో ఎప్పుడూ ఏడుపులేనా.. జనంలో సంతోషం లేదా..

మోదీ ప్రభుత్వం వచ్చాక  ధనవంతులు, పేదల మధ్య అంతరం పెరిగిపోతోందని ప్రతిపక్ష  పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు  జీడీపీ గ్రోత్‌‌  కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో సగటున 8.4  శాతం వృద్ధి చెందగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది మోదీ ప్రభుత్వం గిమ్మిక్ అని ఆరోపిస్తున్నాయి.  మోదీకి  అదానీ, అంబానీలకు మధ్య  దగ్గర సంబంధం ఉందని కాంగ్రెస్ చెబుతోంది.