దేశంలో ఫాక్స్‌‌కాన్ సెమీకండక్టర్ల ప్లాంట్‌‌

దేశంలో ఫాక్స్‌‌కాన్ సెమీకండక్టర్ల ప్లాంట్‌‌

న్యూఢిల్లీ : ఫోన్ల తయారీ కోసం ఇప్పటికే ఇండియాలో ప్లాంట్ పెట్టిన ఫాక్స్‌‌కాన్‌‌   సెమీకండక్టర్ల తయారీ కోసం కూడా ఓ ప్లాంట్ పెట్టాలని చూస్తోంది.  ఇందుకు సంబంధించి అప్లికేషన్‌‌ను సబ్మిట్ చేసిందని లోక్‌‌సభలో ఎలక్ట్రానిక్స్‌‌ అండ్ ఐటీ మినిస్ట్రీ సహాయ మంత్రి రాజీవ్‌‌ చంద్రశేఖర్‌‌‌‌ పేర్కొన్నారు. సెమీకండక్టర్లతో సహా వివిధ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌‌ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం అనేక  చర్యలు తీసుకుంటోందని

 పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. గతంలో వేదాంత గ్రూప్‌‌తో కలిసి సెమీకండక్టర్ల ప్లాంట్ పెట్టాలని ఫాక్స్‌‌కాన్‌‌ చూసింది. తర్వాత  ఈ జాయింట్ వెంచర్‌‌‌‌ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఒక్క కంపెనీనే చిప్‌‌ తయారీ ప్లాంట్ పెట్టనుంది. దేశంలో ప్లాంట్ పెట్టేందుకు చిప్‌‌ల తయారీ కంపెనీ మైక్రాన్‌‌కు ఈ ఏడాది జూన్‌‌లో అప్రూవల్స్ ఇచ్చామని రాజీవ్‌‌ వెల్లడించారు