ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా.. 61 ఏళ్ల ఎలిసబెత్ బోర్న్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా బోర్న్ నిలిచారు. ఇమాన్యుయెల్ మెక్రాన్ ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో.. ప్రధాని జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన మెక్రాన్.. ఆయన స్థానంలో బోర్న్ ను ప్రధానిగా నియమించారు. 2017లో మెక్రాన్ ను చెందిన ఎన్ మార్చ్ పార్టీలో చేరిన చబోర్న్.. 2018లో రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. జూన్ లో ఫ్రాన్స్ లో పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నందునే ప్రధాని మార్పు జరిగినట్లు తెలుస్తుంది. 1991-92లో ఎడిత్ క్రెస్సన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు.
మరిన్ని వార్తల కోసం ...
పాక్ విడిచి వెళ్తున్న చైనా టీచర్లు
రష్యా బలగాలకు మరో ఎదురుదెబ్బ
