
రియల్ ఎస్టేట్ ముసుగులో ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా ప్రజలను ఓ సంస్థ మోసం చేసింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్‌ను ఆశ్రయించారు. ప్రజల నుంచి లక్షల రూపాయలను వసూలు చేసిన మల్టీ జెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై... డబ్బులు ఇన్వెస్ట్ చేసిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి ప్రధాన కారకుడైన రియల్ లైఫ్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ఓనర్ టేకుల ముక్తి రాజ్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు 2 శాతం ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశచూపారని... బాధితులు పేర్కొన్నారు.
మొదట్లో కొంత మొత్తంలో కమిషన్‌ను ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆ తర్వాత నమ్మకంతో రెండు నుండి ఇరవై లక్షల వరకు డిపాజిట్లు చేశామని బాధితులు పేర్కొన్నారు. సుమారు 7 నుంచి 8వేల మంది వారి మాటలు నమ్మి కోట్లలో డిపాజిట్ చేశారు. ఇప్పుడు కార్యాలయాన్ని మూసేసి పరారు కావడంతో బాధితులు మోసపోయామని తెలుసుకున్నారు. లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. సంస్థ నిర్వహకుడుపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.