1000 మందికి కంటి పరీక్షలు పూర్తి
లింగాల, వెలుగు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనూష ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొర వైద్య శిబిరం మంగళవారం ముగిసింది. శంకర నేత్రాలయం చెన్నై ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 18 వరకు వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ క్యాంపులో కంటి సమస్యతో బాధపడుతున్న 1000 మందికి పైగా పరీక్షలు చేసి 85 మందికి ఉచిత ఆపరేషన్లు చేశారు. అనంతరం అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జలంధర్ రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శంకర నేత్రాలయ కో–ఆర్డినేటర్ రాజు, డాక్టర్లు రేనయ్య, రాం చందర్, జగన్ రామాంజనేయులు, శ్రీను పాల్గొన్నారు.
