మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌

మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌

గుడిహత్నూర్‌(ఇచ్చోడ), వెలుగు: ఇచ్చోడ మండలంలోని మేడిగూడలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ హాస్పిటల్, క్రోమ్‌ హాస్పిటల్, హర్ష క్లినిక్, సాయిరాం హాస్పిటల్‌ సహకారంతో శుక్రవారం ఉచిత మెగా మెడికల్​క్యాంప్​నిర్వహించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్, ఏఎస్పీ కాజల్‌ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్‌ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, ఆప్తమాలజీ, డెంటల్, చర్మవ్యాధులు, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్‌ విభాగాలకు చెందిన వైద్యులతో దాదాపు 250 మంది ఆదివాసీ గిరిజనులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందించారు.

 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ప్రజలు డాక్టర్ల సలహా మేరకే మందులు వాడాలని, మూఢ నమ్మకాలు, నాటు వైద్యాలను నమ్మవద్దని సూచించారు. ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సై పురుషోత్తం, డాక్టర్లు క్రాంతి, రజిత క్రాంతి, సాయికిరణ్, రాహుల్‌ పుష్కర్, సాయిరాం, మహేశ్, పోలీస్​అసోసియేషన్‌ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్​వైద్య సలహాదారు శాంతరాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.