
- మలక్పేట కేర్లో ఫ్రీ ఆర్థోపెడిక్, కార్డియాక్ కన్సల్టేషన్
- ప్రతి గురు, శుక్రవారాల్లో ఉచిత సర్వీస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మలక్పేట కేర్ హాస్పిటల్స్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి గురువారం ఉచిత ఆర్థోపెడిక్, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత కార్డియాలజీ కన్సల్టెన్సీ అందిస్తున్నట్టు బుధవారం దవాఖాన యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్హాస్పిటల్స్ సమాజ సేవ చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గుండె, ఎముకల సమస్యలతో బాధపడే రోగులకు ముందస్తు రోగ నిర్ధారణ, నివారణ చికిత్స, సెకండ్ ఒపీనియన్వంటి సేవలను అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్లా తెలిపారు. చాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, గుండె దడ, అధిక రక్తపోటు, తల తిరగడం, పాదాల వాపు లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు శుక్రవారం రావచ్చని.. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మోకాళ్లు, తుంటి ఇబ్బందులు, ఆర్థరైటిస్, ఎముక పగుళ్లు, క్రీడా గాయాలు లేదా రోజువారీ పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారు గురువారం రావచ్చని తెలిపారు. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్ కోసం 040–-6165 6565 నంబర్లో సంప్రదించాలని కోరారు.