వ్యవసాయంలో ఉచిత శిక్షణ

వ్యవసాయంలో ఉచిత శిక్షణ

మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని బేయర్ ​- రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్​ ఆఫ్​ అగ్రికల్చర్​ వ్యవసాయంలో ఆరునెలల ఉచిత శిక్షణ కు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి ఆధునిక వ్యవసాయ విధానాల్లో ఫ్రీ ట్రైనింగ్​ ఇస్తారు.  2019 జూలై నుంచి కోర్సు ప్రారంభమవుతుంది. అర్హత: పదోతరగతి /తత్సమాన ఉత్తీర్ణత. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.60 వేలకు మించకూడదు. గ్రామీణ వ్యవసాయం లేదా వ్యవసాయంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయసు: 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, పదోతరగతి మార్కుల జాబితా, తాజా ఇన్​కం సర్టిఫికెట్​ ను సంస్థ అడ్రస్​కు గడువు తేదీలోగా పంపాలి. లేదా స్కాన్​డ్​ డాక్యుమెంట్స్​ drnvjird@gmail.com కు మెయిల్​ చేయవచ్చు. ఇన్​స్టిట్యూట్​లో నేరుగా ఇవ్వవచ్చు. చివరితేది: 2019 జూన్​ 25; చిరునామా: డైరెక్టర్​, బేయర్ ​- రామనాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్​ ఆఫ్​ అగ్రికల్చర్, తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్​  జిల్లా, 502316; ఫోన్​ నెంబర్​: 8185060769, 8919492493