చర్చిలో ప్రోగ్రామ్..2500 మందికి కరోనా

చర్చిలో ప్రోగ్రామ్..2500 మందికి కరోనా

పారిస్​: ఫ్రాన్స్​లోని మల్హౌస్ సిటీలో జరిగిన ఒక మత సమ్మేళనం ఇప్పుడు 2,500 కరోనా కేసులకు కారణమైనట్లు తేలింది. ఫిబ్రవరి 18 నుంచి వారం రోజులపాటు సాగిన ఈ కంగ్రెగేషన్​కి నాలుగు వేర్వేరు దేశాల నుంచి కూడా వచ్చారు. రోజూ కనీసం 2000 మంది వరకు పాల్గొన్నట్లు అంచనా. మొత్తంగా 10 వేల మందికి పైగానే దీనికి వచ్చారని, వీరు తమ తమ దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణమయ్యారని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది.  మల్హౌస్ సిటీలోని ఒక చర్చిలో ‘ఓపెన్ డోర్ చర్చ్’ పేరుతో వేడుకలు నిర్వహించారు. దీనికి ఫ్రాన్స్ దేశస్తులే  కాకుండా బూర్కినా ఫాసో, గుయానా, స్విట్జర్లాండ్, కార్సికా నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వారం రోజలపాటు సెషన్ల వారీగా జరిగిన ఈ కంగ్రెగేషన్​లో ప్రతి సెషనుకి వెయ్యి నుంచి 2,500 మంది వరకు పాల్గొన్నారు. చర్చికి సంబంధించి 17 మందికి కొవిడ్–19 సోకినట్లుగా గుర్తించారు. దీంతో ఈ కంగ్రెగేషన్​లో పాల్గొన్నవారినందరినీ జల్లెడ పట్టే పనిలో పడ్డారు.  ఈ పరీక్షల్లో ఫ్రెంచ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉద్యోగినికి, కార్సికా ఐలాండ్​కి చెందిన 70 ఏళ్ల మహిళకు,  బూర్కినా ఫాసో క్యాపిటల్ సిటీ ఓగడౌగౌలోని చర్చి పాస్టర్ మమడౌ కరంబిరికి కరోనా పాజిటివ్ అని తేలింది.ఒకే ఫ్యామిలీలోని 10 మందికికూడా కరోనా సోకిందని గుర్తించారు. వీళ్లందరూ మల్హౌస్ సిటీలో జరిగిన కంగ్రెగేషన్​కి వెళ్లిన వాళ్లే కావడంతో నాలుగు దేశాల్లో పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి.

లాక్‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. లెక్కచేయట్లే..రోజూ వేలల్లో రోడ్డెక్కుతున్నారు