ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు అర్నాల్ట్

ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు అర్నాల్ట్

ప్రస్తుత కరోనా కాలంలో ప్రపంచంలో కొత్త కొత్త కుబేరులు తయారవుతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా పరిచయంలేని వారు కరోనా కాలంలో అనూహ్యంగా సంపదను పెంచుకుని  ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉవ్వెత్తున తారాజువ్వలా పైపైకి దూసుకెళ్తున్నారు.  ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్‌ టైకూన్‌ బెర్నాడ్‌ అర్నాల్ట్ దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న వారిని తోసేసి ప్రపంచ నంబర్‌ వన్‌ కుబేరునిగా మారాడు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రెండోస్థానికి పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తం 18,630 కోట్ల సంపదతో బెర్నార్డ్ అర్నాల్ట్‌ నంబర్‌ వన్‌ స్థానంలోఉండగా 18,600 కోట్ల డాలర్లతో బెజోస్‌ రెండోస్థానానికి చేరినట్లు ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది. అలాగే టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ 14,730 కోట్ల డాలర్లతో మూడోస్థానంలో నిలిచారు.