బతికేదెట్టా సామీ : జ్వరం, జలుబు గోలీల ధరలు పెరిగాయి

బతికేదెట్టా సామీ : జ్వరం, జలుబు గోలీల ధరలు పెరిగాయి

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని రకాల ఔషదాల ధరలను పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఏప్రిల్ 1 నుండి ఔషధాల ధరలు పెంచుతున్నట్లు నోటీసు జారీ చేసింది. పెరిగిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం 2024 -25 నుంచి అమలులోకి వస్తాయి. వరుసగా రెండో ఏడాది కూడా నిత్యావసర మందుల ధరలు 10 శాతానికి పైగా పెరగనున్నాయి. గతేడాది ఈ మందుల ధరల్లో దాదాపు 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధరల పెరుగుదల ప్రభావం నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫెక్టివ్‌లు పై కూడా చూపితుంది. 


మెడిసిన్  ధరలు కనిష్టంగా పెంచడాన్ని కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. 2024 మార్చి 27న జారీ అయిన నోటీసుల ప్రకారం.. WPI ఆధారంగా షెడ్యూల్ చేసిన ఫార్ములేషన్‌ల MRPని పెంచవచ్చని మ్యానిఫక్చరింగ్ కంపెనీలకు తెలిపింది. ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి అవసరం లేదని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంది. మొతం 800లకు పైగా రకాల మందుల ధరలు పెరిగాయి. వాటిలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, విటమిన్లు, మినరల్స్, COVID-19 ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి కొన్ని మందులు మరియు స్టెరాయిడ్స్ ఉన్నాయి.

ఏప్రిల్ 1 నుండి ఖరీదైన మందుల జాబితా:
పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్ 
యాంటీ-టిబి ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి.
యాంటీకాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్
విషప్రయోగంలో విరుగుడులు: యాక్టివేటెడ్ చార్‌కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్
యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజిల్పెనిసిలిన్, సెఫాడ్రాక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోన్
కోవిడ్ నిర్వహణ మందులు
రక్తహీనత మందులు: ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ మొదలైనవి.
పార్కిన్సన్స్ మరియు డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్
HIV నిర్వహణ మందులు: Abacavir, Lamivudine, Zidovudine, Efavirenz, Nevirapine, Raltegravir, Dolutegravir, Ritonavir మొదలైనవి.
యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ మొదలైనవి.
కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి.
చర్మసంబంధమైన మందులు
ప్లాస్మా మరియు ప్లాస్మా ప్రత్యామ్నాయాలు
యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్, మొదలైనవి.
మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి.
క్యాన్సర్ చికిత్స మందులు: 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి.
యాంటిసెప్టిక్స్ మరియు క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి.
హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తుమందులు మరియు ఆక్సిజన్ మందులు.